ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకే వైయస్‌ జగన్‌ ఆరాటం

హైదరాబాద్‌: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మహానేత ఆశయ సాధన కోసం వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గొప్ప ఆశయ సాధన కోసం ప్రజా సంకల్పయాత్రతో ప్రజలందరినీ మమేకం చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. దేశ, విదేశాల్లోని వైయస్‌ఆర్‌ అభిమానులకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు 8వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top