వైయస్‌ జగన్‌ది మోడీని ఎదురించే స్వభావం

ఢిల్లీ: తన రాజకీయ స్వార్థం కోసం, ఓటుకు కోట్లు కేసును మాఫీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రధాని మోడీ వద్ద సాగిలపడే స్వభావమని, ప్రజల అవసరాల కోసం మోడీనైనా ఎదురించే స్వభావం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఢిల్లీ నడివీధుల్లో వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న పోరాటమే నిదర్శనమని చెప్పారు. ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ నిర్వహించిన మహాధర్నాలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీని మోస్తున్న పచ్చ మీడియాకు, పచ్చ కార్యకర్తలకు వైయస్‌ఆర్‌సీపీ ఇస్తున్న ఘటైన సమాధానం ఢిల్లీ నడి వీధుల్లో వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న ఈ గర్జనే ఉదాహరణ అన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2014 ఎన్నికల అనంతరమే ప్రత్యేక హోదా సంజీవని అని ఉద్యమించారన్నారు.  ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్తాననే బయంతో చంద్రబాబు ప్రత్యేక హోదాను వద్దు అని ప్యాకేజీని స్వాగతించారన్నారు. టీడీపీ, బీజేపీలు అనుసరిస్తున్న విధానాలపై ఈ రోజు ఈ పోరాటం చేపట్టామన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి జిల్లాలో యువభేరి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రత్యేక హోదా ఒక్కటే కాదు..విభజన చట్టంలోని అన్ని అంశాలను నెరవేర్చాలని మేం పోరాటం చేస్తున్నామన్నారు. చట్టబద్ధమైన అంశాలను పూర్తి చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నొక్కి చెబుతోందని చెప్పారు. హోదా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 
    
 
Back to Top