నీ అవినీతి విశ్వం దాకా ఎగబాకింది..!

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ..!
చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వపాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతి విశ్వందాకా ఎగబాకిందని హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఇసుక అక్రమాలను అరికడతామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇసుకదందా చేస్తూ టీడీపీ నేతలు రూ.2 వేల కోట్లు దోచుకున్నారని బహిరంగంగా పత్రికల్లోనే వచ్చిందిని బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటూ అనాథను చేసిందన్నారు. 

అవినీతి పాలన మీద కమిటీ వేయ్..!
అదనపు మద్యం కోసం డీలర్లు ఇచ్చి చంద్రబాబు కోటరీ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొందని బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ టీడీపీ సర్కార్ ప్రజాధనాన్ని అపహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందుల పాలు జేస్తూ ఇంకా ఎన్ని లక్షలకోట్లు దోచుకుంటారని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా చంద్రబాబు తన అవినీతి పాలనమీద కమిటీ వేసి నిజాయితీ నిరూపించుకోవాలని బ్రహ్మానందరెడ్డి హితవు పలికారు. 

దొంగకు పాలించే అర్హత లేదు..!
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ... చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం ఎంతగా దోపిడీ, అవినీతికి పాల్పడుతుందంటే ...నీతి అన్న పదం ఎత్తడానికే భయపడుతున్నంతగా పాలన సాగిస్తోందన్నారు. చేసేవన్నీ చేస్తూ నేరం నాదికాదు ఉద్యోగులదంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, వాటిని కట్టిబెట్టాలన్నారు. మీ అపజయాలను వేరెవరికో ఆపాదించడం మానుకోవాలన్నారు. ముందుగా మీరు మీ మంత్రులు ,ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలను దోచుకోవడం మాని...ఆతర్వాత అధికార యంత్రాంగాన్ని సరిపెట్టాలన్నారు. లేనిపక్షంలో ఇదే పద్ధతి కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. 
Back to Top