వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయంఒంగోలు: వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఒంగోలు పట్టణంలో ఇంటింటికి వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా వైయస్‌ఆర్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. రానున్నది రాజన్న రాజ్యమే అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యాన్‌ గాలికి ఎదురు నిలువలేరన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి  కేంద్ర మంత్రి గడ్కారి అడిగిన లెక్కలు టీడీపీ చెప్పడం లేదన్నారు. పోలవరాన్ని పూర్తి చేయలేని అసమర్ధుడు బాబు అని విమర్శించారు.  వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై విచారణ చేపడుతామని హెచ్చరించారు. 
 
Back to Top