వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడు

ప్రకాశం: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దమ్మున్న నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంకొల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత నాలుగేళ్లుగా టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు చూస్తున్నామని, చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శ్రమిస్తున్నారని, ఆయనకు అండగా ఉందామని కోరారు. ఇంతటి ప్రజా ఉప్పెనను ఇంకొల్లు చూసిన చరిత్ర లేదని చెప్పారు. వైయస్‌ జగన్‌దమ్మున్న నాయకుడని చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే నవరత్నాల ద్వారా అందరికి మేలు చేస్తారని చెప్పారు.
 
Back to Top