చంద్రబాబు దుర్మార్గపు చర్యకు నిండుప్రాణం బలి

పోలీసుల తోపులాటలో మృతి చెందిన వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త
గుండెపోటుతో మృతి చెందిన కాకి దుర్గారావు
ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంతోనే మృతి
పశ్చిమగోదావరి: ప్రత్యేక హోదా సాధనకు ఒక నిండు ప్రాణం బలైందని, చంద్రబాబు దుర్మార్గానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు గుండెపోటుతో మృతి చెందారని పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం మండలానికి చెందిన కాకి దుర్గారావు బంద్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు పార్టీ సమన్వయకర్త తెల్లం బాలరాజు అరెస్టు నేపథ్యంలో బుట్టాయిగూడెం పోలీస్‌స్టేషన్‌ ఎదుట కార్యకర్తలు ప్రత్యేక హోదా హక్కు అనే నినాదంతో ధర్నా చేపట్టారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కార్యకర్తలకు అడ్డుకున్నారు.. పోలీసుల జులంతో దుర్గారావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి, తెల్లంబాలరాజు దుర్గారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. 

ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయిగూడెంలో బంద్‌ జరుగుతున్న సమయంలో పోలీసులు దౌర్జన్యంగా తమను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా కలిసి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారన్నారు. ఆందోళనలో పోలీసుల అత్యుత్సాహంతో జరిగిన తోపులాటలో కాకి దుర్గారావు కుప్పకూలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసుల దుర్మార్గపు చర్యతో ప్రాణాలు విడిచారని, ప్రభుత్వం నిండు ప్రాణం బలిగొందన్నారు. ప్రభుత్వం కాకి దుర్గారావు మృతికి నైతిక బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి ప్రాణాలు ఎన్నిపోతే కేంద్రం పోరాడుతారో అర్థం కావడం లేదన్నారు. దుర్గారావు మృతి తెలిసిన వెంటనే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి ఆళ్లనాని, వైవీ సుబ్బారెడ్డిలను కృష్ణాపురం పంపించారన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారన్నారు. 

తాజా వీడియోలు

Back to Top