చంద్రబాబు మోసాలను ఎండగడుదాం


పలాస ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ అప్పలరాజు
తూర్పు గోదావరి: చంద్రబాబు మత్స్యకారులను మభ్యపెట్టేందుకు కొత్త కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నానని మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు డాక్టర్‌ అప్పలరాజు విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడుదామని ఆయన పిలుపునిచ్చారు.  ఏ ఒక్క కమిషన్‌ కూడా ఇంతవరకు పూర్తి నివేదిక రాలేదన్నారు. మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మత్స్యకారులను ఎలా మోసం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. 50 ఏళ్లకే పింఛన్లు అన్నారు. వేటకు వెళ్లి చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఇచ్చిన ఓ హామీ చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. మీరు చెప్పిన హామీలు అమలు చేయాలని ధర్నాలు చేస్తే చంద్రబాబు దారుణంగా అవమానించారని, తాట తీస్తానని బెదిరించారని చెప్పారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ఫిషింగ్‌ జట్టు కట్టించాలని కోరారు. తీర ప్రాంతంలో ఉన్న భూములకు మత్స్యకారులు సాగుచేసుకునే హక్కు కల్పించాలని కోరారు. చంద్రబాబును ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. 
 
Back to Top