జగనన్న రావాలి..ప్రజల కష్టాలు తీరాలి..

చంద్రబాబు పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకత
మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య,
విజయనగరంః టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య ఆగ్రహం వ్యక్త చేశారు. టీడీపీ ప్రభుత్వం తీరుపై  ప్రజలు  తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ వస్తేనే మంచి జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. విజయనగరం జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. తోటపల్లి ప్రాజెక్టు విషయంలో  ప్రభుత్వం నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తుందన్నారు. దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో 89 శాతం పూర్తయితే, టీడీపీ పాలనలో నాలుగున్నర ఏళ్లులో 11 శాతం కూడా పూర్తికాలేదని విమర్శించారు. విజయనగరం జిల్లాలో నదులను అనుసంధానం చేస్తానన్న చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.. జగనన్న రావాలి మా జిల్లాలో కష్టాలు తీరాలని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Back to Top