మోడీ, బాబు చేతులు కలిపి మోసం చేశారు

వీరి నాటకాలకు తెరదించేందుకు వైయస్‌ జగన్‌ పోరాటం
అనంతపురం: ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ చేతులు కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో హోదా సంజీవని అని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక హోదాను నీరుగార్చారని మండిపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. హోదా కంటే ప్యాకేజీ మేలని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల వ్యతిరేకతను గమనించి హోదా అంటూ తెరవెనుక నుంచి లీకులు ఇస్తున్నారన్నారు. హోదాపై మొదట్నుంచి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారన్నారు. ఈ నాటకాలకు తెరదించేందుకు వైయస్‌ జగన్‌ ప్రణాళిక బద్ధంగా పోరాటాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోయే అవిశ్వాస తీర్మానం, రాజీనామాలకు మద్దతు తెలపాలని  హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు శంకర్‌నారాయణ డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ వెంట నడిస్తేనే ప్రజలు టీడీపీని నమ్ముతారని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలుపుతారన్నారు. చంద్రబాబు వైఖరి ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసే రకమని, ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు క్షమించరన్నారు. 
 
Back to Top