ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది

  • వైయస్‌ఆర్‌ ఆశయాలు సాధించే సత్తా వైయస్‌ జగన్‌ సొంతం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం: ప్రజా సంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేర్చే శక్తి, సామర్థ్యం ఆయన తనయుడు వైయస్‌ జగన్‌కే ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఆషామాశీ కాదని, వైయస్‌ జగన్‌ అందరి హృదయాలను చురగొన్నారని చెప్పారు. ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకోబోతున్న సందర్భంగా అనంతపురంలో వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని అధికారం చేపట్టిన తరువాత ఎక్కడా.. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన చేసి అందరికీ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఆ విశ్వాసంతోనే ప్రజలంతా వైయస్‌ జగన్‌ అడుగులో అడుగులు వేస్తున్నారన్నారు. ఇంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరన్నారు. వైయస్‌ జగన్‌ వస్తున్నారంటే ఊర్లకు ఊర్లు కదిలివస్తున్నాయన్నారు. 
చంద్రబాబు నమ్మక ద్రోహి
చంద్రబాబు విశ్వాసఘాతకుడని అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ, ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు ఒకే వేదికపై తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అని వైయస్‌ఆర్‌ సీపీపై బుదరజల్లారని, అన్యాయంగా ఆంధ్రరాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విభజించిందని మాట్లాడారన్నారు. ఇప్పుడు తన స్వార్థం కోసం చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడన్నారు. అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తిత్వం చంద్రబాబుదన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం.. అలాంటిది విలువలు మర్చిపోయి పొత్తుపెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నమ్మక ద్రోహి అని అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును తెలంగాణ ప్రజలు కూడా నమ్మరన్నారు. 
 
Back to Top