చంద్రబాబు పతనానికి తెలంగాణలో నాంది


హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు పతనానికి తెలంగాణలో నాంది పలికిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మహా కూటమిని తిరస్కరించారని, మహా ఓటమిని చవి చూసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు ట్రెజరర్‌ పాత్ర పోషించారన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించిన చంద్రబాబు..ఆ తరువాత ఆయన కూడా కాంగ్రెస్‌తో కలిశారన్నారు. ఏపీలో దోచుకున్న అవినీతి సొమ్మును చంద్రబాబు తెలంగాణలో ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్‌ సృష్టికర్తను అని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబుకు పరాభవం దక్కిందన్నారు. లగడపాటి రాజగోపాల్‌తో తెలంగాణలో చంద్రబాబు మహా కుట్రకు తెర లేపారన్నారు. కూట‌మి ఓట‌మి మంచి ప‌రిణామ‌మ‌న్నారు. తెలంగాణ‌లో ప్ర‌జాకూట‌మి పొత్తు అనైతిక‌మ‌న్నారు. నారా చంద్ర‌బాబు చేసిన ప్ర‌చారంతో తెలంగాణ ప్ర‌జ‌లు హ‌ర్ట్ అయ్యార‌న్నారు. అందుకే కేసీఆర్‌ను గెలిపించార‌న్నారు. 600 హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌కుండా ఇక్క‌డ వ‌చ్చి నీతులు చెబుతున్నార‌ని గ్ర‌హించార‌న్నారు. 

 
Back to Top