స్పీకర్‌ అసెంబ్లీ విలువలు మంటగలపడం సబబేనా?


వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్‌: శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం బాధాకరమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కోడెల శివప్రసాదరావు శాసనసభ విలువలను మంటకలిపే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ విలువలు మంటగలిపేలా స్పీకర్‌ వ్యవహరించడం సబబేనా అని ప్రశ్నించారు. టీడీపీ సర్కార్‌ అప్పు చేసి మరీ దుబారా కార్యక్రమాలు చేయడం చేపట్టడం, పంటి వైద్యం కోసం లక్షల రూపాయల ప్రజాధనం చెల్లించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. 
 
Back to Top