పాత గుంటూరు ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం

హైదరాబాద్‌: పాత గుంటూరు పోలీసుస్టేషన్‌లో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్‌ విఫలం కావడంతోనే రాష్ట్రంలో నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.  దాచేపల్లిలో కూడా బాలికపై అత్యాచారం జరిగిందన్నారు. సుబ్బయ్య అనే వ్యక్తిపై కేసు పెడితే అతను ఆ రోజే ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అత్యాచారం చేసిన వ్యక్తికి అదే చివరి రోజు అనడం తప్పు అన్నారు. గుంటూరు పాత పోలీసుస్టేషన్‌లో జరిగిన సంఘటనలో కూడా అలాంటి ఘటనే జరిగిందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను బట్టే దాడి జరిగిందన్నారు. దాచేపల్లిలో మరో సంఘటన జరిగిందని, బాలికలపై దాడులు అధికమయ్యాయన్నారు. 
 
Back to Top