కేంద్రమంత్రులను కలిసి అమర్‌నాథ్‌

ఢిల్లీ: వైజాగ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ బృందం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసింది. ఈ సందర్భంగా అచ్చుతాపురంలోని ఎస్సీజెడ్‌లో కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రొడక్షన్స్‌ మొదలు పెట్టాయని, ప్రొడక్షన్‌ వ్యర్థాలన్నీ సముద్రతీరంలోకి వదులుతున్నారన్నారు. దీంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, మత్స్య సంపద నాశనం అవుతుందని, కంపెనీలు నిర్మాణం చేపట్టాలంటే తక్షణమే వ్యర్థాలు వదిలేందుకు ప్లాంట్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని పర్యవరణ శాఖామంత్రి హర్షవర్దన్‌ను కోరడం జరిగిందన్నారు. అదే విధంగా రాంబిల్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని సంబంధిత మంత్రిని కోరామన్నారు. అంతే కాకుండా జె్రరిపోతులపాలెంలో దళిత మహిళలపై టీడీపీ నేతలు చేసిన దాడిని కేంద్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ రామ్‌శంకర్‌ కఠారియా దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top