ఏపీని అగ్రరాజ్యంగా నిలబెట్టాలని జననేత తపన
విశాఖపట్నం: 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికొదిలేశాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోందన్నారు. పదేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తూ ఆంధ్రరాష్ట్రాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టాలనే తపనతో వైయస్‌ జగన్‌ ఉన్నారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్నారన్నారు. పాదయాత్ర ద్వారా అధ్యయనం చేసిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడనే నమ్మకం ఆంధ్రరాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. 
 
Back to Top