చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూని

శాంతియుతంగా నిరసన చేస్తే అక్రమ కేసులా..
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
అమరావతిః చంద్రబాబు ప్రజాస్వాSమ్యాన్ని ఖూని చేస్తున్నారని మంగళగిరి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే విచారణ పక్కదారి పడుతుందని శాంతియుతంగా నిరసన చేస్తే   కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించడం దుర్మార్గమన్నారు.  నిష్ఫక్షపాతంగా విచారణ చేయాల్సిన టీడీపీ ప్రభుత్వం వైయస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శాంతియుతంగా నిరసన తెలియజేశామన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో వైయస్‌ జగన్‌పై జరిగింది హత్యాయత్నం అనే సంగతి స్పష్టమయ్యిందన్నారు. నిందితుడి దగ్గర మరో కత్తి కూడా దొరికిందన్నారు. హత్యయత్నం చేసిన నిందితుడు ఎవరు..పూర్వాపరాలన్నీ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు,పోలీసులు,మంత్రులు ఈ కుట్రలో సూత్రధారులు,పాత్రధారులు అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. చంద్రబాబు అరాచక పాలన సాగిస్తున్నారని, రాజధానిలో భూములివ్వని రైతులను కూడా టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందన్నారు. అనాగరికంగా పంటలను సైతం తగలబెట్టిస్తుందన్నారు.టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు కాలం చెల్లబోతుందన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top