వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని విమర్శిస్తే సహించం


వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి హెచ్చరించారు. మహానాడులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్‌రెడ్డి ఆయన కుటుంబాన్ని విమర్శించడం దారుణమన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి హెచ్చరించారు. 

 
Back to Top