టీడీపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వొద్దు


గుంటూరు: టీడీపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వద్దని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు. తెనాలి సభలో ఆయన మాట్లాడారు. తెలుగు దేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆదిశేషగిరి రావు విమర్శించారు. జన్మభూమి కమిటీలతో అవినీతిలో కూరుకుపోయారని తెలిపారు. అందరం ఒక్కటై వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందామన్నారు. రాజకీయ దళారిగా ఉన్న చంద్రబాబు అఖిలపక్షం పేరుతో మరోమారు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.    ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెబితే తప్ప..వారిని ఊర్లో తిరుగనివ్వద్దని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూశామని, ఎన్నో పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. తెనాలి ప్రజలు విజ్ఞులని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సూచించారు. 
Back to Top