చంద్రబాబులో అభద్రతా భావం

 
వైయ‌స్ఆర్‌ సీపీ నేత ఆదిశేషగిరి రావు  

 గుంటూరు :  ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ చేస్తోన్న పోరాటం చూసి చంద్రబాబులో అభద్రతా భావం నెలకొందని  వైయ‌స్ఆర్‌ సీపీ సీనియ‌ర్ నాయ‌కులు ఆదిశేషగిరి రావు  పేర్కొన్నారు. కుట్రలు, మోసాలకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరని  ఆయ‌న‌ విమర్శించారు. నవ నిర్మాణ దీక్షల పేరిట చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తన అసరమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంతో పాటు ప్రతిపక్షంపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టు సాధించిన ఘనత మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డికే దక్కుతుందని ఆదిశేషగిరి రావు వ్యాఖ్యానించారు. 

Back to Top