వైయస్‌ జగన్‌ వెలుగులా వచ్చాడు

విశాఖ: చీకటిలో ఉన్న ఈ నియోజకవర్గానికి వైయస్‌ జగన్‌ వెలుగులా వచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆదిప్‌రాజు పేర్కొన్నారు. స‌బ్బ‌వ‌రంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఇవాళ టీడీపీ పాలనలో చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ కలిసి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో భూ సమస్యను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికలకు ముందు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. అసెంబ్లీలో ఏ నాడు కూడా ఎమ్మెల్యే మాట్లాడలేదన్నారు. జె్రరిపోతుల సంఘటనలో ఎమ్మెల్యే కుమారుడు లేడని నిరూపించగలరా అని ప్రశ్నించారు.  యువకులందరం కలుసుకుంటే చేయలేనిది ఏమీ లేదన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
 
  
Back to Top