టీడీపీ.. తెలుగు దొంగల పార్టీ

- వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగ‌ల పార్టీ అని, అందులో మొత్తం దొంగలు, అవినీతిపరులతో నిండిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పుంగనూరులో గడపగడపకు వైయ‌స్ఆర్‌సీపీ  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ద్వారా కేవలం టీడీపీ వారు మాత్రమే లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ నుంచి ప్రత్యేకహోదాకు వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. నల్లారి కిషోర్‌కుమార్‌ని ఎ్రరచందనం స్మగర్లర్‌ అని ప్రకటించిన చంద్రబాబు టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి నిబద్ధతలôని వ్యక్తి రాజకీయాల్లో ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. 
Back to Top