అట్ట‌హాసంగా వైయ‌స్ఆర్ కుటుంబ ప్ర‌చారం

హైద‌రాబాద్ః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వైయ‌స్ఆర్ కుటుంబం ప్ర‌చారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు, ప్ర‌జ‌ల‌ను వైయ‌స్ఆర్ కుటుంబంలో భాగ‌స్వాముల‌ను చేసేందుకు ముందుకు క‌దిలారు. ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు 23వ వార్డులో నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త గుణ్ణం నాగ‌బాబు ఆధ్వ‌ర్యంలో ఇంటింటికీ ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతుంది. కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో విడ‌వ‌లూరు మండ‌లం మ‌న్మ‌ధ‌రావుపేట‌లో వైయ‌స్ఆర్ సీపీ కార్యాద‌ర్శి, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇంటింటికీ వైయ‌స్ఆర్ కుటుంబ కార్య‌క్ర‌మం మొద‌లైంది. 
అనంత‌పురం జిల్లాలో.. 
రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం రాయంప‌ల్లిలో మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇంటింటికీ వైయ‌స్ఆర్ కుటుంబం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప్ర‌తి గ‌డ‌ప‌కూ వెళ్లి ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. 
ప్ర‌కాశం జిల్లా...
ప్ర‌కాశం జిల్లా టంగుటూరు మండ‌లం న‌ల్లూరులో వైయ‌స్ఆర్ సీపీ నేత  హ‌నుమారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఇంటింటికీ వైయ‌స్ఆర్ కుటుంబం ప్రారంభమైంది. అదే విధంగా కొండేపి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఇన్‌చార్జ్ వ‌రికూటి అశోక్‌బాబు ఆధ్వ‌ర్యంలో ఇంటింటికీ వైయ‌స్ఆర్ కుటుంబం మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top