మానవత్వాన్ని చాటుకున్న కువైట్ సభ్యులు

కువైట్: పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరుకు చెందిన జి. కృపారాణి ( 45 ) అనే మహిళా మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ముందుకువచ్చి వైయస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.  కువైట్ లో గత 10 సం.లుగా ఉంటున్న కృపారాణి  అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 18 - 12 - 16న  మరణించారు. ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  వీరి వద్ద పాస్ పోర్ట్ లేదు, కువైట్ రెసిడెన్సి (అకామా) లేదు. కృపారాణి దగ్గరి బంధువు  వైయస్సార్సీపీ  కువైట్  కన్వీనర్ యం. బాలిరెడ్డి దృష్టికి తీసుకు రాగ వెంటనే స్పందించి  సేవాదళ్ వైస్ ఇంచార్జ్  కె. నాగసుబ్బారెడ్డికి తెలిపారు. ఆయన భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి ఇండియా పాస్ పోర్ట్ ఆఫీసు నుండి కృపారాణి పాస్ పోర్ట్ వివరాలు తెప్పించి తాత్కాలిక పాస్ పోర్ట్ చేసి  సుమారు 75 వేల శవపేటిక, విమాన ఖర్చులు  ఉచితంగా ఇప్పించారు. 

హైదరాబాద్ నుండి ఏలూరులోని  తన  స్వగృహం వరకు  గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, సోషల్ మీడియా ఇంచార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి  ఉచిత అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, యం. బాలిరెడ్డి మాట్లాడుతూ... కృపారాణి మృతదేహాన్ని ఇండియా పంపేందుకు సహకరించిన భారత రాయబార కార్యాలయ అధికారులకు, కమిటి సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. 07 - 01 -17 న సభ ఆసుపత్రి మార్చురిలో వైయస్సార్సీపీ కువైట్ కో కన్వీనర్ గోవిందునాగరాజు, ప్రధాన కోశాధికారి యన్. మహేశ్వర్ రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి షేక్ ఫయాజ్, గవర్ని కౌన్సిల్ సభ్యుడు లాజరాస్, మీడియా ప్రతినిధి పి. సురేష్ రెడ్డి, సలహా దారుడు యన్. చంద్రశేఖర్ రెడ్డి, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, ఇలియాస్, బాలిరెడ్డి, నాగసుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కృపారాణి భౌతికకాయాన్ని సందర్శించి  నివాళిలు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top