బాధితులను ఆదుకుంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

నెల్లూరుః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు ఆహారపదార్ధాలు, వస్త్రాలు పంపిణీ చేశారు. తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లా పూర్తిగా తుడుచుకుపెట్టుకు పోయిందని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు కాలనీలు ఇంకా  జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా గత నాలుగు రోజులుగా అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని కోటంరెడ్డి తెలిపారు. బెడ్ షీట్ లు, పాలు సహా ఇతర ఆహార పదార్థాలు అందజేస్తున్నామన్నారు. 
 
శ్రీధర్ రెడ్డి  ఇవాళ బావిమిట్టపాలెంలో పర్యటించి బాధితులకు సరుకులు పంపిణీ చేశారు. తుఫాన్ ముందస్తు చర్యలు చేపట్టడంలోనూ, బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని కోటంరెడ్డి అన్నారు. స్థానికులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛందసంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదల కాలనీలు అనేక  సమస్యలతో  కొట్టుమిట్టాడుతున్నాయని, ఈప్రాంత అభివృద్ధి కోసం శాశ్వత పరిష్కారం చూపాలని కోటంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top