మరోసారి ఢిల్లీతో ఢీకొడదాం



అన్నా..బాపట్ల మీది..నియోజకవర్గ ప్రజలంతా మీ వెంటే ఉన్నారు. వైయస్‌జగన్‌ ఎవరికి భయపడడు. ఢిల్లీతో ఢీ అంటే ఢీ అనే వ్యక్తి వైయస్‌జగన్‌. మరోసారి ఢిల్లీతో తగలపడుదాం..ప్రత్యేక హోదాను సాధించుకుందామని కోన రఘుపతి అన్నారు. వైయస్‌ జగన్‌ మాటే ఇవాళ చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబుకు అనుభవం ఉందని ఓట్లు వేసిన ప్రజలు ఇవాళ లెంపలేసుకుంటున్నారని చెప్పారు. ఈ రోజు గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిని వివరించామన్నారు. అలాగే వైయస్‌జగన్‌ చేసిన పోరాటాలను ప్రతి ఇంట వివరించామని చెప్పారు. రైతులను, మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అడ్డగోలుగా సంపాదించారని, అడ్డదారిన రాజధాని భూములను అడ్డదారుల్లో లాక్కున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌కు రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి ఉందన్నారని చెప్పారు. ఎవరు మోసం చేశారో..ఎవరు మాటపై నిలబడ్డారో ప్రజలకు అర్థమైందన్నారు. బాపట్లలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందన్నారు. గాదే వెంకటరెడ్డి చేపట్టిన మురుగుకాల్వలతో ఇవాళ దోమల బారిన పడుతున్నామన్నారు. చంద్రబాబు దోమల మీద దండ యాత్ర అంటూ గొప్పలు చెప్పారన్నారు. బాపట్లకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ కావాలని కోరారు. ప్రజలు గెలిపించుకున్న సర్పంచ్, ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేదన్నారు. శ్రీకృష్ణ దేవరాయులు ఎంతో గొప్పగా పాలించారని అయితే ఎక్కడా ఆయన విగ్రహాలు లేవన్నారు.  రఘుపతి భయపడతారని, రఘుపతిని కొనే దమ్ము ఎవరికైనా ఉందా? పులి కడుపున పుట్టిన బిడ్డను, వైయస్‌ జగన్‌ను సీఎం చేసే వరకు అన్న వెంటే ఉంటానని స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ఒక విధానపరంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని చెప్పారన్నారు. ఈ ప్రాంతం కూడా జిల్లా అవుతుందన్నారు. రెండేళ్లుగా తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో ఎమ్మెల్యేను తొలగించి ఓడిపోయిన కౌన్సిలర్‌ను కమిటీ చైర్మన్‌గా పెట్టారన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసే వరకు అలుపెరగని పోరాటం చేద్దామని కోన రఘుపతి కోరారు.

తాజా వీడియోలు

Back to Top