వైయ‌స్‌ఆర్‌సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి అరెస్ట్


అనంత‌పురం:  అధికారంలో ఉన్నాం..మాకెవరు అడ్డు అన్న రీతిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న అధికార దురహంకారం, పోలీసుల దౌర్జన్యమే ఇందుకు నిదర్శనం. తాడిప‌త్రి వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త పెద్దారెడ్డిని పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేశారు. ఆయ‌న అరెస్టును పార్టీ నాయ‌కులు, ప్ర‌జాస్వామ్య‌వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీకి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని ప్ర‌జ‌లు హెచ్చ‌రిస్తున్నారు.

యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ పీ కార్యకర్త బాషాపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, జేసీ అనుచరులు మోహన్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి, పెద్దారెడ్డి, రమణారెడ్డి మూకుమ్మడిగా బుధవారం దాడి చేశారు. విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తిమ్మంపల్లి గ్రామానికి గురువారం చేరుకొని బాధితుడిని పరామర్శించారు. అనంతరం బస్టాండు వద్ద కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి గొడవలూ ఘర్షణలకు పోకండి అని కార్యకర్తలకు సూచించారు.అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించి, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని సర్దుకుపోవా లని తెలిపారు.  ఇదే సందర్భంలోనే వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త బాషాపై దాడిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులను రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు నిలదీశారు.  దీంతో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్‌రెడ్డి ద్వారా  కేసులు నమోదు చేయించారు.


Back to Top