రాప్తాడులో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తాం

 

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురుతుందని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రాప్తాడు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మహానేతకు ఈ నియోజకవర్గం అంటే ఎనలేని ప్రేమ ఉందన్నారు. నాడు కరువు నుంచి ఆదుకునేందుకు, వలసలు నివారించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బోర్లు వేయించారని, బ్రరెలు, గొ్రరెలు ఇప్పించి ఆదుకున్నారన్నారు. ఫ్యాక్షన్‌ నిర్మూలనకు కృషి చేశారని గుర్తు చేశారు. పరిటాల రవి హయాంలో నియోజకవర్గంలో గ్రానైట్‌ పరిశ్రమలు మూతపడ్డాయని, ఎంతో మంది ఉపాధి కోల్పోయారన్నారు. ప్రస్తుత టీడీపీ పాలనలో ఒరిగింది ఏమీ లేదని, మహానేత నిర్మించిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి లష్కర్‌ పనిచేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో  అనంతపురంలో ఒక్కటైనా సాగునీటి ప్రాజెక్టు కట్టారా అని నిలదీశారు. పరిటాల సునీత పొలాలకు నీళ్లు ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఆమెకు నీళ్లు ఉన్నాయి కాబట్టి జిల్లా అంతటా పచ్చగా ఉందని సునీత భావిస్తున్నారన్నారు.  నాలుగేళ్ల టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు. రాప్తాడు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుందని ఆయన వెల్లడించారు. 
 
Back to Top