బాబు పాలనపై ప్రజలు విసుగుచెందారుపత్తికొండ: తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలంతా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు తండోప తండాలుగా వస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీదేవి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలన ఏ విధంగా ఉంటుందో.. ప్రజలకు వివరిస్తున్నారని ఆమె చెప్పారు. వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించేందుకు ప్రజలంతా ప్రజా సంకల్పయాత్రలో భాగస్వాములవుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగిపోయారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పచ్చకండువా కప్పుకున్న వారికే అందుతున్నాయన్నారు. ఇల్లు, పెన్షన్, రేషన్‌ వంటివి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందడం లేదన్నారు. ప్రజలంతా బాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని శ్రీదేవి చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం రాగానే సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. 
Back to Top