ఓట్లేసి జనానికి బాబు వాతలు


పశ్చిమ గోదావరి:  నమ్మి ఓట్లు వేసిన ఓటర్లకు చంద్రబాబు వాతలు పెట్టే కార్యక్రమం చేపట్టారని వైయస్‌ఆర్‌సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాటిన ఓ మొక్కనని పేర్కొన్నారు. నా జీవితం ప్రజలకే అంకితం చేస్తానన్నారు. వైయస్‌ జగన్‌ ఆశీర్వాదంతోమీ అందరికి మేలు చేస్తానని మాట ఇచ్చారు. నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని, వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గంలో స్థలం దొరకడమే కష్టంగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో మంది పేదలకు ఇల్లు కట్టించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి వైయస్‌ జగన్‌ కూడా ఇల్లు ఇస్తారని చెప్పారు. ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులు చెరువులు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శించారు. జగన్నాథపురంలో చెరువు గుంతలో పడి మా బాబాయి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు ధన దాహం ఉందని, ఇలాంటి వారికి బుద్ధి చెబుదామని, వైయస్‌ జగన్‌కు అండగా ఉందామని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.48 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇప్పించానని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కార్మికులను, రైతులను , డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పట్టించుకోవడం లేదని, ఓట్లు వేసిన ఓటర్లకు వాత పెట్టారని మండిపడ్డారు. 
 
Back to Top