వైయ‌స్ పురుషోత్తంరెడ్డికి వైయ‌స్ విజ‌య‌మ్మ నివాళులు
 వైయ‌స్ఆర్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డికి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ వైయ‌స్‌ పురుషోత్తంరెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌నివాళుల‌ర్పించారు. గుండెకు సంబంధించిన వ్యాధితో వైయ‌స్ఆర్‌ జిల్లా కడపలోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. వైయ‌స్‌ రాజారెడ్డి తమ్ముడైన పురుషోత్తంరెడ్డి పులివెందులలోని వైయ‌స్‌ రాజారెడ్డి హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా ఉంటూ  లక్షలాది మంది పేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. పురుషోత్తంరెడ్డి భౌతిక కాయాన్ని ఇవాళ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. 
 

తాజా వీడియోలు

Back to Top