వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు

హైదరాబాద్:
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.  పార్టీ
నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్
లోని పార్టీ కార్యాలయంలో  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
నాయకులు వైఎస్ జగన్ కు స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాల్లో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి విష్ చేశారు.  అనాథలకు పండ్లు,
దుస్తుల పంపిణీ, రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

శ్రీకాకుళం:
వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీకాకుళంలో సర్వమత
ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి
శాంతి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అందరపు సూరిబాబుతో పాటు భారీ
సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.

విశాఖ: మాడుగుల నియోజకవర్గంలో బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు.

రాజమండ్రి:
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు
పంపిణీ చేశారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మేడపాటి షర్మిల రెడ్డి
ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం చేపట్టారు. పి.గన్నవరంలో రోగులకు పాలు.
పండ్లు పంపిణీ చేశారు. ముమ్మడివరంలో గుత్తుల సాయి, అనపర్తిలో సూర్యనారాయణ
రెడ్డి ఆధ్వర్యంలో హస్టల్ విద్యార్ధులకు, వృద్ధులకు పండ్లు, రొట్టెలు
అందించారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో
మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, రోగులకు పాలు,
పండ్లుతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
గుంటూరు:
వేమూరు నియోజవవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు
మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు పెద్ద ఎత్తున
నిర్వహించారు. పేద విద్యార్ధులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు.

ప్రకాశం: కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ బాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

చిత్తూరు: వైఎస్సార్సీపీ నాయకులు ఉజ్వల రెడ్డి ఆధ్వర్యంలో వరదయపాలెంలో వికలాంగులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.

అనంతపురం: రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

వైఎస్సార్
జిల్లా: జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా
నిర్వహించారు. పార్టీ నాయకులు పోలా శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి, మురళీ
రెడ్డి ఆధ్వర్యంలో  కేక్ కట్ చేసి రక్త దాన కార్యక్రమం చేపట్టారు.
కమలాపురంలో అనాథ ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఖమ్మం:
ఖమ్మం జిల్లాలో తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి
శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు.
Back to Top