హోదాను పక్కనబెట్టిన టీడీపీ..చర్చకు పట్టుబట్టిన వైయస్సార్సీపీ

హైదరాబాద్ః అసెంబ్లీ మళ్లీ వాయిదా పడింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో వైయస్సార్సీపీ చర్చకు పట్టుబడుతుంటే...అధికార టీడీపీ హోదాను పక్కనబెడుతూ సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఐనా మొక్కవోని దీక్షతో ప్రతిపక్ష సభ్యులు ఏపీ ప్రజల సంజీవని అయిన హోదాపై చర్చ జరపాల్సిందేనంటూ నినదిస్తున్నారు. వైయస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించడం హోదాను కాలరాయడమేనని వైయస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు.  స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఐదుకోట్ల మంది ప్రజల ప్రత్యేకహోదా ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నారు.తాజా ఫోటోలు

Back to Top