ప్రభుత్వ చీఫ్‌ విప్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వశ్రీనివాసులపై వైఎస్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన బుధవారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈనెల 18న పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా వైఎస్‌ జగన్‌..శాసనసభకు చదివి వినిపించిన డాక్యుమెంట్లను పనికి రానివని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వశ్రీనివాసులు ఆరోపించారు. అయితే కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు అసత్యమైనవంటూ ఉప్పులేటి కల్పన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
Back to Top