పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

విజయవాడః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. సమావేశ ప్రాంగణం వద్ద ప్రతిపక్ష నేత, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కు నేతలు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా అక్కడ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వైయస్ జగన్ నివాళులర్పించారు.  చంద్రబాబు ప్రభుత్వం  వైఫల్యాలు,  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రతిపక్షం, మీడియాపై కొనసాగుతున్న అణచివేత వైఖరి వంటి అంశాలతో పాటుగా దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ‘గడప గడపకూ వైయస్సార్’ అనే పార్టీ కార్యక్రమాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లాల్సిన తీరుపై వైయస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5 గంటల వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఈసమావేశానికి వైయస్ జగన్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నాయకులు హాజరయ్యారు. 
Back to Top