చంద్రబాబు ఓ పెద్ద రాబందు


– నారా కుటుంబాన్ని బహిష్కరించాలి
– ఎన్టీఆర్‌ వారసుల్లో ఎవరో ఒకరు టీడీపీ పగ్గాలు చేపట్టాలి

హైదరాబాద్‌: చంద్రబాబు ఒక పెద్ద ఆక్టోపస్, పెద్ద రాబందు అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి విమర్శించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఆయనకు నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఎన్‌టీఆర్‌ అభిమానులు ఈ చర్యలను అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.  చంద్రబాబు టీడీపీని ఆక్రమించి, ఎన్‌టీఆర్‌ కుటుంబాన్ని దూరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని హరికృష్ణ అడగాలా?..ఎన్టీఆర్‌ వారసునిగా సీఎంగానో, ఇతర ముఖ్యస్థానంలో ఉండాల్సిన హరికృష్ణ ఇతరులను కోరే స్థాయికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి ఎన్టీఆర్, ఆయన కుటుంబాన్ని దూరం చేసి నారా వారసత్వం కోసం చూస్తున్నారని విమర్శించారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని కొడుకును మంత్రి చేసి సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ వారసుల్లో బాలకృష్ణకు ఎమ్మెల్యే ఇచ్చి మిగిలిన వారిని పక్కనపెట్టారని విమర్శించారు. చంద్రబాబు కబంధ హస్తల నుంచి టీడీపీని కాపాడి ఎన్టీఆర్‌ వారసుల్లో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలని సూచించారు. నారా కుటుంబాన్ని బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.
 
Back to Top