‘కేశవరెడ్డి’పై చర్యలు తీసుకోవాలి


కర్నూలు: విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి రూ.100 కోట్లు కాజేసిన కేశవరెడ్డి విద్యా సంస్థల చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి గౌరు వెంకట్‌రెడ్డి, మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాధితులు డిమాండు చేశారు. శుక్రవారం ఈ మేరకు సీఐడీ అ సిస్టెంట్‌ సూపరింటెండెంట్‌కు  గౌరు వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, కేశవరెడ్డి బాధితులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం, అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేశవరెడ్డి సంస్థల ఆదాయం రూ.100 కోట్ల పైనే ఉంటుందన్నారు. ఆ మొత్తం ఎటు వెళ్లిందో చెప్పాలని డిమాండు చేశారు. రూ.100 కోట్లు మోసం చేస్తే కేశవరెడ్డి కుమారుడికి స్కూల్‌ నిర్వాహణ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేశవరెడ్డి, వియ్యంకుడు మంత్రి ఆదినారాయణరెడ్డి ఉద్దేశపూర్వకంగానే బాధితులకు డబ్బు కట్టకుండా ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
 
Back to Top