అడ్డగోలు పాలనా విధానాలను వివరించేందుకే పాదయాత్ర


శ్రీకాకుళం:  రాష్ట్రంలో జరుగుతున్న అడ్డగోలు పాలనా విధానాలను ప్రజలకు వివరించేందుకే వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేయాల్సి వచ్చిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజల ఆస్తిని సింగపూర్‌ కంపెనీలకు చంద్రబాబు ధారదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని బూముల్లో 58 శాతం సింగపూర్‌ కంపెనీలదన్నారు. 42 శాతం ప్రభుత్వానిది అంటే అన్యాయమన్నారు. కారు చౌకగా విదేశీ కంపెనీలకు ప్రజలాస్తిని 1600 ఎకరాలు అప్పగించారన్నారు. స్వీస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టిందన్నారు. అయినా ఖాతరు చేయకుండా అదే విధానంలో రాజధాని నిర్మాణం కోర్టు ధిక్కారణ కాదా అని ప్రశ్నించారు. 
 
Back to Top