‘నిప్పు’ను దాచే ప్రయత్నం



– ప్రపంచ స్థాయికి బాబు అవినీతి
– ఎయిర్‌ ఏషియా కుంభకోణంతో మరోసారి బాబు బంఢారం బట్టబయలు
– ప్రపంచంలోనే అత్యున్నత దళారీ చంద్రబాబు
– పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు పరువు తీశారు
– దీపక్‌ తల్వార్‌ ద్వారా సమాచారం రాబట్టారు
– ఈ క్రమంలోనే చంద్రబాబు దళారీ వ్యవహారం వెలుగు చూసింది
– ఇంతటి స్కామ్‌పై పచ్చ మీడియా మౌనం దాల్చాయి
– కొండంత అవినీతిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు పాట్లు
– వాచీ లేదు..ఉంగరం లేదంటూ నంగనాచి కబుర్లు
– నాలుగేళ్లలో రూ. 4 లక్షల కోట్ల అవినీతి
 
హైదరాబాద్‌: చంద్రబాబు అవినీతి ప్రపంచ స్థాయికి చేరిందని, ఆ విషయం ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో మరోమారు బట్టబయలైందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అత్యున్నత దళారీ అని జాతీయ పత్రికలు కోడై కూస్తుంటే..ఆయనను ఏపీలో మోసే పచ్చ మీడియా నిప్పును కూడా దాచే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు అత్యంత నమ్మకస్తుడిగా దళారీ వ్యాపారాలలో ఆరితేరిన అజ› కసోది కంటే కూడా గొప్పవాడన్నారు. రాజకీయాల్లో ఉంటూ చంద్రబాబు కంటే బేహారి మరోకరు ఉండరని మండిపడ్డారు. ఏయిర్‌ ఏసియా చైర్మన్‌ టోర్ని పెర్నాండెజ్, ఇక్కడ ఉన్న ఎండీ శాండియల మధ్య జరిగిన సంభాషణలలో విమానయానాలకు సంబంధించి లాభాలు తీసుకురావడంలో చంద్రబాబు వంటి నమ్మకమైన వ్యక్తిగా ఉపయోగపడుతాడని, ఆయన వలన ఏ పని అయినా సాధ్యమవుతుందని, మోడీ కంటే చంద్రబాబు చాలా బలవంతుడని, ఏ పని అయిన చేయగలడని, ఆయన ద్వారా చేసుకుందామని ఆడియో టేపుల ద్వారా దొరికాయని నిన్న బిజినెస్‌ టూడే, దక్కన్‌ క్రానికల్‌ ప్రచురించాయన్నారు. 

చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఎంత పెద్ద ఎత్తున విస్తరించిందంటే..చంద్రబాబు లాగా వ్యవస్థలను మానేజ్‌ చేయగల వ్యక్తి వేరే ఎవరు లేరని, ఏ పనైనా ఆయన ఖచ్చితంగా చేయగలరని దళారీలకు నాయకత్వం వహించే వ్యక్తి చంద్రబాబు అని తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు అవినీతి, మోసాలకు సంబంధించి ఏపీకే పరిమితం కాకుండా యవత్తు ప్రపంచానికి ఇలాంటి వ్యక్తి దళారీగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. చంద్రబాబు ఈ అంశంపై, ఆయన పాత్రపై ఎల్లో మీడియా ఒక్క వార్త కూడా రాయకుండా, ప్రచురించకుండా, చూపకుండా దాచిపెట్టాయని విమర్శించారు. చంద్రబాబుకు భజన చేసే ఓ వర్గం మీడియా ఎందుకు ఈ వార్తను దాచిందని ఆయన నిలదీశారు. దీపక్‌ తల్వార్‌ అనే బ్రోకర్‌ ద్వారా సమాచారం రాబట్టారని, చంద్రబాబు ఓ నమ్మకస్తుడని ఆడియో టేపులు బయటకు వచ్చినా..ఏపీలో చంద్రబాబును మోస్తున్న పచ్చ మీడియా దాని గురించి ఒక్క మాట కూడా మాట్లడలేదన్నారు. లోకేష్‌ ట్వీట్ల ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించారన్నారు. 

చంద్రబాబు ఏమో నా అంత నీతిపరుడు లేడని, నా అంత ఉన్నత సంస్కారవంతుడు లేడని అవసరం లేకపోయినా ఏయిర్‌ ఏసియా కుంభకోణంలో ఆయన పాత్రను పక్కకు పట్టించేందుకు ‘‘తమ్ముళ్లు నా 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎంత నిజాయితీదో, నాకు ఉంగరం లేదు. వాచ్‌ లేదు..అమ్మాయిలతో తిరిగానా తమ్ముళ్లు ’’ అంటూ ఆశ్చర్యకరమైన రీతిలో చంద్రబాబు ప్రవర్తించారన్నారు. ఏపీలో 40 శాతం మందికి వాచ్‌ ఉంటుందని, ఉంగరం ఉంటుందన్నారు. ఇవి ఉన్నవారు అవినీతిపరులని చంద్రబాబు ఉద్దేశమా? అన్నారు. చంద్రబాబు మాత్రం మద్యం ముట్టలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు గత చరిత్ర చుట్టు పక్కల ఉన్న ప్రచారాలను మేం చెప్పామన్నారు. అత్తుమ్‌ నరసింహులు మీకు గుర్తుకు ఉంటారో లేదో నాకు తెలియదన్నారు. చిన్న దుకాణం నడిపే నరసింహులు ద్వారా చంద్రబాబు చేసిన ఘనకార్యాలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. చెలమయ్యను అడిగితే చంద్రబాబు విద్యార్థి దశలో ఆయన కథలు విడమర్చి చెబుతారన్నారు. 

మద్యాన్ని ముట్టలేదని చెప్పే చంద్రబాబు గురించి తిరుపతిలోని చిన్నబజారులోని వినాయక బ్రాందీ షాప్‌ వద్దకు వెళ్లే ఆయన గురించి చెబుతారన్నారు. జనానికి ఏమీ తెలియదని ఇప్పుడు చంద్రబాబు గొప్పులు చెప్పుకుంటే ఎవరు నమ్మరని సూచించారు. చంద్రబాబు నిజాయితీ, ఆయన క్యారెక్టర్‌ చేదుడు బావి అంత లోతు అన్నారు. ఎంత తవ్వితే అంత బయటకు వస్తుందనని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని గురించి మీరు పొగుడుకోవడం కాదని, మద్యనిషేదాన్ని అంత వ్యతిరేకించే చంద్రబాబు, అది పాడు పని అయినప్పుడు మీ మామ ఎన్‌టీఆర్‌ మద్యాన్ని నిషేదిస్తే మీరేందుకు ఆవిష్కరించారని ప్రశ్నించారు. బెల్టు షాపులు రద్దు చేస్తున్నానని మొదటి సంతకం చేసిన చంద్రబాబు రాష్ట్రమంతా బార్లా ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. అధికారుల చేత ఒత్తిడి చేయించి జనంతో ఎందుకు మద్యం తాగిస్తున్నారని నిలదీశారు. కొండత మీ అవినీతిని కప్పి పుచ్చడానికి గోరంత నీతితో మూచే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అవినీతి, దుష్ట కార్యాకలాపాలతో నడిపిన హస్త కలాపాలు చంద్రబాబువి అన్నారు. గాంధీకి వాచ్‌పెట్టుకునే అలవాటు ఉందని, వాచ్‌ పెట్టుకునే వారికి సత్‌ప్రవర్తన ఉండదని, ఇవి లేకుండా త్యాగించిందనందుకు ఈయన చాలా గొప్ప సంఘ సంస్కర్తగా చెప్పుకుంటున్నారన్నారు. నీ గురించి ఈ తరానికి తెలియకపోవచ్చని, తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విద్యార్థి దశ నుంచి చంద్రబాబు ఏం చేశారో ఆయన సరస సల్లాపాల దగ్గర నుంచి మద్యం దుకాణాల వైపు మీరు మరిగిన కార్యక్రమాలు మొదలు, వ్యవస్థలను మేనేజ్‌ చేసే మూలాలు, మూలకాలు మీ చిన్నతనంలో ఏ రకంగా అక్కడి వారందరికీ తెలుసునని స్పష్టం చేశారు. 

నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు రూ.4 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల మూలుగును పీల్చి పిప్పి చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మీ నాయకులు కూడా ఏ రోజు మీ నిజాయితీ గురించి మాట్లాడిన సందర్భాలు లేవన్నారు. మీ నాయకత్వాన్ని గురించి పొగిడి ఉంటారని చెప్పారు. ఎవరూ పొగడటం లేదని చంద్రబాబు తన గురించి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు సత్‌ప్రవర్తన, పాలన దక్షతను ప్రజలు అంగీకరించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక కన్నీరు ఏరులై పారిందని, 650 మంది గుండెలు ఆగిపోయాయని చెప్పారు. అలిపిరిలో మీపై జరిగిన దాడిని చూసి తిరుపతిలోని టీ అమ్ముకునే వారు కూడా తమ పని ఆపలేదన్నారు. బిల్‌గ్రేట్స్, బిల్లుక్లింటన్‌ పొగిడారని మీకు మీరే చెప్పుకున్నారన్నారు.

ప్రజల జీవితాల్లో ఒక వెలుగులు నింపారని ఏ నాడైనా చంద్రబాబు గురించి చెప్పుకున్నారా అని ప్రశ్నించారు.  అలాంటి భావన తెలుగు ప్రజల్లో ఒక్కరికీ కూడా లేకపోవడం మీ పరిపాలనకు నిదర్శమన్నారు. వైయస్‌ జగన్‌ జైలుకు వెళ్లారని మీ జీవితకాలమంతా దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చార్జీషిట్లు ఉన్నాయని అబద్ధాలు వల్లవేస్తే ప్రజలు నమ్మరన్నారు. కౌరవులు అజ్ఞాతవాసం చేశారని, పాండవులు అరణ్యవాసం చేశాడని, కృష్ణుడు జైలుపాలు అయ్యాడని, దుర్యోదనుడు అత్యున్నత నేత అని చెబుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ జైలుకు వెళ్లింది చంద్రబాబు వల్లే అన్నారు. సోనియా గాంధీతో చంద్రబాబు కుమ్మక్కై సీబీఐని ఉసిగొల్పారన్నారు. అలాంటి చంద్రబాబు నిజాయితీ గురించి మాట్లాడటం దారుణమన్నారు. రావణాసురుడు సీతను వెతకడానికి రాముడికి సాయం చేసినట్లే ఉందని చంద్రబాబు నిజాయితీ అని వివరించారు. 

నిప్పు లేకుండా పొగ రాజేసే మోసే పచ్చ మీడియా అంతర్జాతీయంగా మీ అంతా దళారీ లేదని చెబుతుంటే, ఆ నిప్పును కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. మహిళలపై చంద్రబాబుకు ఉన్న నీచమైన ఆలోచన బాధాకరమన్నారు. ఆత్మానందం పొందుతూ..ఆత్మానందస్వామిగా మారి మీకు మీరే జడ్జిగా ఊహించుకోవడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు తాగి మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలను విస్మరించిన చంద్రబాబు తనకు తానే నిజాయితీ పరుడు అని సర్టిఫికెట్లు ఇచ్చుకుంటన్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు ద్వారా దేశవ్యాప్తంగా నేరస్తుడిగా మారితే, ఏయిర్‌ ఏషియా కుంభకోణంతో ప్రపంచవ్యాప్తంగా దళారీగా తెలిసిపోయారన్నారు. డీజిల్‌పై పన్ను ఎందుకు విధించారని, విమానయానంలో ఉన్న 16 శాతం పన్నును ఒక్కశాతానికి ఎందుకు తగ్గించారని, విమానయాన సంస్థలకు మేలు చేయాలనే చంద్రబాబు తపన తేటతెల్లమైందన్నారు. రైతుల జీవితాలను ఛిద్రం చేసే విధంగా డిజిల్‌ ధరపై రూ. 4 అదనంగా వ్యాట్‌ విధించారన్నారు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భూమన హెచ్చరించారు.
 
Back to Top