హిందూ సాంప్రదాయాలకు చంద్రబాబు గండి

– అర్చకుల కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్న చంద్రబాబు
– వారసత్వ అర్చకత్వం ఏళ్ల నుంచి అమలవుతోంది
– నాలుగు వారసత్వ కుటుంబాలకు ఎంతో విశిష్టత ఉంది
– అన్యమతస్తుల పాలనా కాలంలో కూడా స్వామి వారి వ్యవహారాల్లో తలదూర్చలేదు
– అమరావతిలో బౌద్ధమతానికి ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు
– ప్రశ్నించే వాళ్ల మీద చంద్రబాబు కక్షసాధింపు చర్యలు

తిరుపతి: హిందూ సాంప్రదాయాలకు చంద్రబాబు గండి కొడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో కులాల మధ్య చిచ్చు పెట్టిన విధంగా చంద్రబాబు అర్చకుల కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు.  రాజకీయ ప్రాకులాటకోసమని, కులాల మధ్య వైశమ్యాలు తరగిలించేందుకు చంద్రబాబు తన నలభై సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించారన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు..

ఇవాళ వెంకటేశ్వరస్వామి క్షేత్రంలో కూడా చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీటీడీలో చంద్రబాబు మారణకాండను, ఆరని అగ్ని జ్వాలను వెలిగించారని మండిపడ్డారు. ఇది అత్యంత దారుణమైన విషయమని, వేంకటేశ్వరస్వామికే అపచారమన్నారు. వేంకటేశ్వరస్వామి తిరుమల క్షేత్రంలో ఎప్పుడు వెళిశారో తెలియనంతగా పురాతన కాలం నుంచి ఆ స్వామి అక్కడ స్వయంబుగా వెలిసినప్పటి నుంచి భరద్వజ గోత్రికులైన గోపినాథ్‌ దీక్షితుల వంశస్తులైన అర్చకులు అనువంశీయులుగా, ఆగర్భమూర్తులై, నరరూప నారాయణలుగా పేరుగాంచి స్వామివారికి కైంకర్యులుగా చేస్తున్నారన్నారు. 

9వ శతాబ్ధంలో ఆ భరద్వజ గోత్రికులు తమ ఇష్టప్రకారంగా రెండు వంశాలుగా మార్చుకున్నారన్నారు. కౌశిక గోత్రంగా శ్రీనివాసులు దీక్షితులు మార్చుకున్నారన్నారు. భరద్వజ గోత్రికులు పైడిపాలెం, గొల్లపల్లి వంశీయులుగాను, కౌశిక గోత్రికులు తిరుపతమ్మ పెద్దింటి వంశీయులుగా మారారన్నారు. వీరు వందలాది సంవత్సరాలుగా స్వామివారికి కైంకర్య సేవలు చేస్తున్నారన్నారు. స్వామి క్షేత్రం అభయారణ్యంగా ఉన్న రోజుల్లో కూడా వీరు స్వామి వారి సేవలో తరించారన్నారు. ఇది కేవలం ఒక వృత్తిగా కాకుండా భగవత్‌ సంకల్పంగా భావించిన ఈ నాలుగు కుటుంబాల వారు  కైంకర్య పరులని చెప్పారు. వెంకటేశ్వరస్వామి, ఈ అర్చక కైంకర్యాలు సజావుగా సాగితేనే బాగుంటుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. 

ఈ నాలుగు కుటుంబాలకు ఇంత పెద్ద ఎత్తున గౌరవ మర్యాదలు ఇచ్చారన్నారు. స్వామివారి శీలావిగ్రçహానికి అర్చకత్వం వహించే ఈ నాలుగు కుటుంబాలు వేలాది సంవత్సరాలుగా అర్చకత్వం చేయడం వల్లనే స్వామి వారికి ఇంత పరిపూర్ణత వచ్చిందన్నారు. ప్రపంచంలో ఏ దేవాలయానికి, ఏ మతానికి సంబందించిన ఆలయాల కంటే భిన్నంగా వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో గొల్ల సన్నిది వంశీయులు, తిరుమల నంది వంశీయులు, అనంతవాయు వంశీయులు, తాళ్లపాక వంశీయులు, మహంతులు, తరిగోండ వేంగమాంబకు సంబంధించిన వాళ్లు, మైసూరు మహారాజుల సంస్థానానికి సంబంధించిన ప్రతినిధులతో వందల సంవత్సరాలుగా విరజిల్లుతుందన్నారు. 11వ శతాబ్ధిలో శ్రీభగవత్‌ రామానుజచారులు భారత దేశమంతా కూడా తిరుగుతూ..వైష్ణవ సాంప్రదాయ శిఖరాలను చాటుతూ..నెలకొల్పుతూ..పాంచరత్న ఆగమంతో అనేక దేవాలయాలకు పూజ పునష్కారాలను స్థిరీకరించే వంటి చర్యలు అమోఘంగా చేస్తున్న దశలో వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో వైకానత ఆఘమ సూత్రాల ప్రకారం ఇక్కడ అర్చకత్వం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఏకాంగి వ్యవస్థను నెలకొల్పారన్నారు. అక్కడ ఉన్న ఆచారాలకు శ్రీభగవత్‌రామానుజచారుల వారే వెనుబలంగా ఉన్నారే తప్ప బలవంతంగా పాంచరత్నాన్ని రుద్దకుండా ఈ అర్చక స్వాముల గౌరవాన్ని కాపాడారన్నారు. అక్కడ పెద్ద జీయర్, చిన్నజీయర్‌ స్వాములు వచ్చి ఇక్కడి ఆచార వ్యవహారాలకు చేదోడుగా నిలిచారన్నారు.

జగత్‌ ప్రసిద్దులైన చక్రవర్తులు, మండలాదీషులు, పీఠాధిపతులు, మహ్మదీయ చక్రవర్తులు, రాజులు, బ్రిటీషు వాళ్లు, ఇస్టిండియా కంపెనీ వారు  ఎవరూ కూడా స్వామి వారి ఆచారాలలో తల దూర్చలేదన్నారు. వీరంతా కూడా పాలనా వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. స్వామి వారి ఆదాయ, వ్యయ వ్యవహారాలను మాత్రమే తమ పాలనను కుదించుకుని ఆ స్వామివారి నైవేద్య కైంకర్య వ్యవహారాలకు పూర్తిగా ఈ నాలుగు వంశాలదే బాధ్యత అని కాపాడుతూ వచ్చారన్నారు. ఈ క్రమాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, దురద్దేశంతో ఆచార వ్యవహారాల మీద నియమ నిబంధన ఉల్లంఘనలకు అమరావతిలో అత్యంత సుందర నగరంగా నిర్మిస్తున్నానని, సింగపూర్, జపాన్, చైనాను ఆదర్శంగా తీసుకుంటున్న చంద్రబాబు దానితో పాటు బౌద్ధ ఆచారాలను నెలకొల్పాలన్న విషపు ఆలోచనలతో హిందు సంప్రదాయాల మీద పెద్ద గండి కొడుతున్నట్లుగా భావించేలా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు సందేహాలు లేవనెత్తితే, అనుమానాలను వ్యక్తికరించారన్నారు. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అనుమానాలు వ్యక్తీకరించారు కాబట్టి తల కొట్టేయాలి అనే సంస్కృతి గజినీలది, ఘోరిలది అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలని ఇలాంటి సంస్కృతి కాదన్నారు. ప్రశ్నించడం అంటే పాపంగా భావించే వ్యక్తి చంద్రబాబు. 

ఆగమోత్తంగా , తరతరాలుగా జరుగుతున్న ఆచార, వ్యవహారాలకు భిన్నంగా వేంకటేశ్వరస్వామికి సమర్పించే నైవేద్యాల పోర్టులో ఏదో జరిగిందన్న అనుమానాలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. స్వామి వారి కోసం జీవితాలను త్యాగాలు చేసిన ఈ నాలుగు కుటుంబాల పెద్దల తలలు నరికి, పరిహారంగా పాపఫలం చంద్రబాబు అర్చకులకు అందించారన్నారు. ఇదేనా న్యాయమని ప్రశ్నించారు. ఇదేనా హైందవ సంస్కృతికి తెలుగు దేశం పార్టీ ఇస్తున్న గౌరవం అని భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. అర్చక వ్యవస్థలో ఈ నాలుగు కుటుంబాల వాళ్లును కొనసాగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో అపారమైన సంపతి ఉందని, కానీ ఉద్దేశపూర్వకంగానే తరతరాలుగా ఉన్న కుటుంబాల సంప్రదాయాలపై దెబ్బకొడుతున్నారన్నారు. సంభావణ అర్చకులను పూర్వపు మిరాశీ కుటుంబీకులపై ఉసిగొల్పి, ఈ నాలుగు కుటుంబాల మధ్య కూడా చిచ్చు రగిల్చారన్నారు. ప్రశ్నించే స్వాములపై వీరిని ఉసిగొల్పే నీచపు కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టడం హిందుత్వంపై దెబ్బ కొట్టినట్లుగా భావించాలన్నారు. 

వేంకటేశ్వరస్వామికి అర్చక సేవ చేస్తున్న ప్రతి ఒక్క స్వామి దైవసమానులే అన్నారు. ప్రధాన అర్చకులు, ప్రభుత్వం తల నరికిన స్వాములు కానీ, అక్కడ ఉన్న సంభావణ అర్చకులు ఎవరైనా కూడా మాకందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రులే అని స్పష్టం చేశారు. వారంతా కూడా దైవాంశభూతులే అన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడి మీలో మీరు తగాదాలు పడుతూ..ప్రభుత్వం ఆడిస్తున్న నాటకంలో పావులుగా మారుతూ..అర్చక స్థాయినే అనుమాన పడే విధంగా దిగజార్చుకునే స్థాయిలో వ్యవహరించడం తీరని బాధను మిగుల్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితమంతా కులాల మధ్య కుంపట్లు రగిలించి ఆ మంటలో చలి కాచుకునే రాజకీయవేత్త అన్నారు. అధికారులను ఇందులో ఉసిగొల్పి, రమణదీక్షితులు, ఇతర స్వాములు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా, ప్రభుత్వ జీవో అంటూ మూలనపడిన జీవోను బయటకు తీసి ఈ రోజు ఇంప్లిమెంట్‌ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మీ అవసరాలకు అయుధాలుగా జీవోలను వాడుకోవడం సరికాదన్నారు. సాంప్రదాయాల మీదా, ఆచారాల మీద, తరతరాల సంస్కృతి మీద అధికారులకు, ప్రభుత్వాలకు ఆజమాయిషి, అధికారమన్నది రాదు అన్నది గుర్తించుకోవాలని, ఎవరికి పెత్తనం ఉండదని హెచ్చరించారు. 
 
Back to Top