గెలుపే ల‌క్ష్యం


- 2019లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించాలి
- బూత్ క‌మిటీల‌ది కీల‌క పాత్ర‌
- తూర్పుగోదావ‌రి జిల్లా బూత్ క‌మిటీ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా: 2019 ఎన్నిక‌ల్లో జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ లెవల్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణా తరగతులు భాస్కరపద్మ ఫంక్షన్‌ హాల్‌లో శుక్ర‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ శిక్షణ తరగతులను పార్టీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కందుల దుర్గేష్, కొప్పున మోహన్‌రావు, వేణుగోపాల్‌కృష్ణ, పాముల రాజô శ్వరి, రౌతు సూర్యప్రకాశ్‌రావు, తదితరులు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఇందుకు బూత్‌ కమిటీల పాత్ర కీలకమన్నారు.   చంద్రబాబు చేస్తున్న దుష్ట పాలనపై అందరూ విరక్తి చెందారని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్‌ కమిటీలు నిరంతరం కష్టపడాలని సూచించారు.  అన్ని పథకాల్లో అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, వాటిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కక్కిద్దామని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే తమ విధివిధానం, ఆలోచన అని వివ‌రించారు.  దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ లేని ఆలోచనలు, ఆశయాలు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నాయని తెలిపారు. రాజ‌న్న రాజ్యం రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌న్నారు. ఇందుకోసం ప్ర‌తి ఒక్క‌రూ సైనికుల్లా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.
Back to Top