అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం


తిరుపతి: దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితం అందరికీ ఆదర్శమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా తిరుపతి బస్టాండ్‌ వద్ద గల ఆయన విగ్రహానికి భూమన పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్‌ వ్యక్తి కాదు.. మహోన్నతుడని, ఆయన ఆశయ సాధన కోసం నాయకులు, యువత పాటుపడాలని కోరారు. 
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వద్ద..
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. విద్యా సమానత్వం, కుల సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో అంబేద్కర్‌ రిజర్వేషన్లు కల్పించారన్నారు. 
Back to Top