రండి..ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుదాం


– ఢిల్లీలో మా ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చున్నారు
– మేం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు లోక్‌సభను స్తంభింపజేశాయి
– ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేరుద్దాం
– చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు
– టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి

హైదరాబాద్‌:  ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు టీడీపీ కలిసిరావాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన మీడియాతో మాట్లాడారు.   2014లో రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలు అధికారాన్ని పంచుకొని నాలుగేళ్లుగా హామీలను విస్మరించారన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల తీరును హెచ్చరిస్తూనే వైయస్‌ఆర్‌సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తుందన్నారు. ఇటీవల కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఐదుగురు ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలలో వీరోచిత పోరాటం చేశారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌జగన్‌ ఇది వరకే ప్రకటించిన విధంగానే ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి కొద్ది సేపటి క్రితమే ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారన్నారు. ఇది ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదని, ఏడాది క్రితమే మా అధినేత ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, చంద్రబాబు, తన మంత్రి వర్గ సభ్యులు మసిపూసి మారడి కాయ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తామ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షమేరకు ఎంపీలు రాజీనామా చేయాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారన్నారు. అయితే టీడీపీ ఎంపీలు ఈ విషయంలో ముందుకు రావడం లేదన్నారు. సంప్రదింపులకు, మభ్యపెట్టేందుకు సమయం ఇది కాదని, రాజీనామాలు చేయడమే ముందున్న కర్తవ్యమన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి ఏం సాధించారన్నారు. ఢిల్లీలో రహస్య మంతనాలు చేశారు తప్ప..ఏపీ ప్రజల ఆకాంక్షను వివరించలేకపోయారన్నారు. ఇంకా అఖిలపక్షాన్ని పిలుస్తామని మభ్యపెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు అవినీతిపై విచారణ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇక ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. దోబుచులాటతో కాలయాపన చేయకండని,  ఇప్పటికైనా పొరపాటు జరిగిందని చంద్రబాబు ఒప్పుకొని తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ధర్మాన సూచించారు. ఇప్పుడు రాజీనామాలు చేయకపోతే ప్రజలు  మిమ్మల్ని దోషులుగా నిలబెడతారని హెచ్చరించారు. అందరం కలిసి బీజేపీపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. 
 
Back to Top