వైఎస్సార్ కాంగ్రెస్ లో పెరుగుతున్న చేరికలు

వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ. మహానేత ఆశయాలకు ఊపిరిగా నిలిచిన పార్టీ. సంక్షేమ పాలకుడి
ఆచరణలను అడుగుజాడలుగా మార్చుకున్నపార్టీ. దుర్నీతిని,
స్వార్థ రాజకీయాలను ఎదిరించి నిలిచిన పార్టీ. కుట్రలను,
కుతంత్రాలను ఒక్కడై తిరగబడి, పోరాడుతున్న నాయకుడు
నడిపిస్తున్న పార్టీ. ‘విశ్వసనీయతే నా విధానం. ప్రత్యేక హోదా నా నినాదం’ అంటున్న వైఎస్ జగన్ కు తెలుగు
రాష్ట్రం యావత్తూ బ్రహ్మరధం పడుతోంది. నాయకుడిపై నమ్మకం,
పార్టీపై విశ్వాసం వెరసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి.
కార్యకర్తలు, నేతలు, సాధారణ
ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరుతున్నారు. ప్రధానంగా టిడిపి,
కాంగ్రెస్ ల నుంచి వైఎస్సార్సీపిలోకి వచ్చి చేరుతున్న వారి సంఖ్య అధికంగా
ఉంటోంది. రోజూ వందల సంఖ్యలో పార్టీలో చేరికలు జరుగుతున్నాయని
బూత్ లెవల్ లీడర్లు, కన్వీనర్లు తెలియజేస్తున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ వద్దకు తమ అనుచరులతో సహా వచ్చి చేరుతున్న
నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. అధికార పార్టీలో ఉన్నవారు
సైతం ఇన్నేళ్లుగా చంద్రబాబు పాలనలో తమ ప్రాంతాలు అభవృద్ధికి నోచుకోలేదని, స్థానికంగా ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ ఆవేదన చెందుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్లో కి చేరడం ద్వారా ప్రజల్లో తమ పట్ల విశ్వాసం పెరుగుతుందని
పలువురు సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట. అన్ని జిల్లాల
నుంచి ప్రధాన నాయకులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసమే అందుకు కారణం.

ప్రజా
సమస్యలపై నిత్యపోరాటం

స్థానిక
సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలు సత్వరం స్పందించడం, పార్టీ అధినాయకత్వం సైతం
రాష్ట్ర సమస్యలపై నిలిచి పోరాడుతుండటం, బాధితులకు అండగా ఉంటూ,
న్యాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం వంటివి ప్రజల్లో పార్టీకి మంచి పేరు
తెచ్చాయి. రైతులకోసం, ప్రాజెక్టుల కోసం,
నీటి కోసం, ప్రత్యేక హోదా కోసం వివిధ సందర్భాల్లో
యువనేత జరిపిన పోరాటాలు ఓ నవ నాయకుడిని ప్రజలకు పరిచయం చేసాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు కూడా విపరీతంగా ఆకర్షించాయి. దానికి తోడు ప్రజా సంకల్ప పాదయాత్రలో యువనేత ప్రజలను ఆప్యాయంగా పలకరించే తీరు,
ప్రజా మేనిఫెస్టో ప్రకటన కూడా తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న అంశాలని
రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నవ
నాయకత్వంపై విశ్వాసం

కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై వైఎస్
జగన్ పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ప్రజలు గ్రహిస్తున్నారు. అతడిపై బనాయించిన కేసుల్లో నిజాలు లేవని న్యాయస్థానంలో నిరూపణ అవుతోంది.
మబ్బులు తొలగిన సూర్యుడి లాగా వైఎస్ జగన్ ప్రభ వెలుగులు చిమ్ముతోంది.
యువనేతపై అశేష తెలుగు ప్రజల్లో నమ్మకం బలపడుతోంది. ప్రజానాయకుడిగా, మహానేత వారసుడిగా, అక్రమాలను ఎదిరిస్తున్న ఒకేఒక్కడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసారు వైఎస్
జగన్. గెలిచిన పార్టీ కి నమ్మకద్రోహం చేసి, కొందరు నేతలు అధికార పార్టీలోకి ఫిరాయించినా తొణక్కుండా నిండు కుండలా నవ్విన
వైఎస్ జగన్ గుండె ధైర్యానికి తెలుగు ప్రజలు సలాం చేస్తున్నారు. అడుగడుగునా విమర్శలతో, అడ్డంకులతో అవమానిస్తున్నా వెనక్కు
తగ్గని ప్రతిపక్షనేత మనోధైర్యాన్ని మనసారా అభినందిస్తున్నారు. ఈ పరిణామాలతోనే వెను తిరగని యోధుడు వెన్ను చూపని వీరుడు వైఎస్ జగన్ అనే అభిప్రాయం
ప్రజల్లో బలపడిపోయింది.

ఆది
నుంచీ హోదాపోరాటం

వన్
మెన్ ఆర్మీలా మొదలుపెట్టిన హోదా ఉద్యమాన్ని ప్రజా సైన్యం కూడగట్టి, రాజకీయ పక్షాలను ఏకం చేసి
పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్న తీరు చూసి ప్రజలు ముగ్ధులౌతున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి, అవిశ్వాసంతో కేంద్రాన్ని ఢీకొట్టి, దేశం యావత్తూ ఒక్కసారిగా
ఎపి వైపు చూసేలా చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. చంద్రబాబు
అవినీతిని నిరసిస్తూ, అధికారంలోకి వస్తే తానేం చేస్తాడో వివరిస్తూ
ప్రజాసంకల్పం చేపట్టారు వైఎస్ జగన్. కోట్లాది మంది తెలుగు వారి
హృదయాలకు చేరువయ్యారు. ఒక పక్క ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల్లో
మమేకమౌతూ, మరోపక్క ప్రత్యేక హోదా కోసం బలమైన పోరాటం చేస్తూ,
తన సిద్ధాంతలతో ప్రజలనే కాదు పార్టీలను, ప్రభుత్వాన్ని
కూడా ప్రభావితం చేస్తున్న యువనేతకు ఎపి ప్రజలంతా ఫిదా అయిపోతున్నారు. అధికార పార్టీనేతలు, టిడిపి అభిమానులు, ఇతర పార్టీల అనుయాయులు సైతం అభిమానులైపోతున్నారు. హార్డ్
కోర్ ఫాన్స్ గా మారిపోతున్నారు.

 

Back to Top