వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో పార్టీ జండాను ఎగరవేశారు. దివంగత వైఎస్సార్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ప్రతిన పూనారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.<strong>అనంతపురంలో..</strong> వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా ప్రజలతో మమేకమైయ్యారని, ప్రజల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లి అధికార పార్టీపై ఒత్తిడి తేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని వివరించారు. యువకులు, మహిళలు, కార్మికులు, రైతుల శ్రేయస్సు కోసం పార్టీ అనునిత్యం పరితపిస్తుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీదే భవిష్యత్ అన్నారు. <strong>కర్నూలులో...</strong>జిల్లాలోని నందికోట్కూరు, ఆధోని, పాణ్యం నియోజకవర్గ పరిధిలో గౌరు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. నందికోట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యకర్తలకు పార్టీ విశిష్టతను వివరించారు. <strong>ప్రకాశంలో...</strong>వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి హాజరై జెండావిష్కరణ చేసి, అనంతరం కేక్ కట్ చేశారు. గడియార స్తంభం సెంటర్‌లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పార్టీ సీనియర్ నాయకులు యడం బాలాజీ వరికూటి అమృతపాణి, కోరబండి సురేష్‌కుమార్ తదితరులు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. దర్శి ప్రాంతాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.