ఘ‌నంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్స‌వం

హైదరాబాద్: ఈ నెల 12వ తేదీ వై ఎస్సార్సీపీ ఆవిర్బావ దినోత్స‌వం. ప్ర‌జ‌ల తర‌పున‌, ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ఆవిర్భ‌వించిన రోజు. అందుకే దీన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పార్టీ నాయ‌క‌త్వం నిర్ణ‌యించింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.  12వ తేదీ(శనివారం) ఉదయం 10 గంటలకు అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందులో పార్టీకి చెందిన అంద‌రు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పాల్గొనాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఈ సందర్బంగా ప‌లు  సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యలపై పార్టీ సాగిస్తున్న పోరాటాలను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకొని వెళ్లాల‌ని పేర్కొన్నారు. 
Back to Top