పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తాం

విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైయ‌స్ఆర్‌ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న కొన‌సాగిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం టీడీపీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదో ప్రజల సమాధానం చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను అఖిలపక్షానికి ఆవ్వానించడం నిబంధనలకు విరుద్దమైన చర్య అని మండిపడ్డారు. బుట్టా రేణుకను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంలోనే టీడీపీ-బీజేపీ కుమ్మకైన విషయం వెల్లడైందని పేర్కొన్నారు.  

Back to Top