ఫిరాయింపు ఎంపీ లోక్‌సభ నాయకురాలా?


- ఎంపీ బుట్టా రేణుకను వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ నాయకురాలిగా కేంద్రం గుర్తింపు
- కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ప‌లు అనుమానాలు
– కేంద్రం నిర్ణయంపై ప్రజాస్వామ్యం అపహాస్యం
ఢిల్లీ: ఢిల్లీ నడివీధిలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ నాయకురాలిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. వర్షకాల పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఇవాళ లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ నాయకురాలిగా కేంద్రం పిలవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగమే.  ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు ఇటీవల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యవహరారించేవారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టారేణుక అధికార టీడీపీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని గత రెండేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ స్పీకర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, తాజాగా పార్టీ ఫిరాయించిన బుట్టారేణుకను లోక్‌సభ నాయకురాలిగా కేంద్రం గుర్తించడంతో టీడీపీ, బీజేపీల మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేస్తోంది. ఈ తీరు ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో అపహాస్యం చేసినట్లుగా ఉంది. ఇటీవల బుట్టా రేణుకను టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నారా లోకేష్‌ ప్రకటించారు. అలాంటి బుట్టా రేణుకను లోక్‌సభ నాయకురాలిగా గుర్తించడం కుట్రలో భాగమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
Back to Top