కాల్ మనీపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టు

అసెంబ్లీః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నేతల కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి వైఎస్సార్సీపీ సభ్యులు  నినదిస్తున్నారు. మహిళల ఆడమాన ప్రాణాలు దోచుకొని టీడీపీ నేతలు సాగించిన రాక్షస క్రీడపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. టీడీపీ నేతలను రక్షించేందుకు చంద్రబాబు కాల్ మనీని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ ను కోరారు. ఇంతకంటే ప్రధాన అంశమైన ప్రధాన అంశం మరొకటి లేదని అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చించాకే ఇతర అంశాలపై చర్చిద్దామని పెద్దిరెడ్డి చెప్పారు.   ప్రజల ముందు దోషిగా నిలబడాల్సివస్తుందన్న భయంతో ప్రభుత్వం కాల్ మనీని  నీరుగార్చేందుకు కుట్ర చేస్తోంది. .
Back to Top