గణేష్‌ కుటుంబానికి సిద్దారెడ్డి ఆర్థిక సాయం

కదిరి టౌన్‌: కదిరి మునిసిపల్‌ పరిధిలోని కుటాగుళ్లలోని తారకరామనగర్‌కు చెందిన గణేష్‌ రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వైయస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీ.వీ.సిద్దారెడ్డి సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆరేళ్ల కిందట తన భర్తను, ఇప్పుడు వున్న ఏకైక కుమారుడ్ని పోగొట్టుకొని అంతులేని విషాదంలో వున్న గణేష్‌ తల్లి రామసుబ్బమ్మను పరామర్శించి ఓదార్చారు. తనకు ఆసరాగా వున్న కొడుకు ఇలా తనను వదిలి వెళ్లాడని సిద్దారెడ్డి ఎదుట బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తన వంతు సాయంగా రామసుబ్బమ్మకు రూ.10వేల నగదును సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో సిద్దారెడ్డి వెంట ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు కేఎస్‌ బహవుద్దీన్‌తోపాటు కౌన్సిలర్‌ గంగాధర్, నాయకులు కేవీ సురేష్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ గంగరాజు, వెంకటరమణ, బీసీ నాయకుడు బెస్త వెంకటేష్, మైనార్టీ నాయకులు అబుబకర్, ఫాజిల్, బాబా, మహబూబ్‌బాషా, సర్ఫరాజ్, మోహనర్‌రెడ్డి, శివారెడ్డిలు వున్నారు.

Back to Top