పేపర్‌ లీకేజీపై చర్చకు వైయస్‌ఆర్‌సీపీ పట్టు

ఏపీ అసెంబ్లీ: టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీపై సభలో చర్చించేందుకు అవకాశం కల్పించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. మంగళవారం రెండు సార్లు సభా వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు లీకేజీ వ్యవహరంపై ఆందోళన చేపట్టారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లీకేజీపై చర్చకు పట్టుబట్టిన వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు ఐదు నిమిషాలు మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అయినా కూడా స్పీకర్‌ అవకాశం కల్పించలేదు. దీంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. దీంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మైక్‌ ఇచ్చిన స్పీకర్‌ నిమిషం వ్యవధిలోనే కట్‌ చేశారు. సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన రిపోర్టును ఐదు నిమిషాల్లో చదివి వినిపిస్తామని చెప్పడంతో వెంటనే మైక్‌ కట్‌ చేశారు. ఆ తరువాత మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ..ఈ నెల 30న స్టేట్‌మెంట్‌ ఇస్తామని సమాధానం చెప్పడంతో అందుకు సమ్మతించని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు.

Back to Top